పురుగుల మందు కలిసిన గడ్డి మేసి 35 జీవాలు మృతి..
ముఖ్యమైన పాయింట్స్:సరుగుడు తోటలో విషాదం.. కాపరుల కన్నీరుమున్నీరు..మృతిచెందిన జీవాలకు పరిహారం అందించాలని బాధితుల వేడుకోలు..
పాతపట్నం, సెప్టెంబర్ 28 సిక్కోలు గర్జన న్యూస్:
వంశధార జలాశయం ఎగువ ప్రాంతంలోని సరుగుడు తోటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పురుగుల మందు పిచికారీ చేసిన గడ్డి, సరుగుడు ఆకులను మేయడంతో సుమారు 20 గొర్రెలు, మేకలు మృతి చెందినట్లు బాధితులు తెలిపారు. ఒక్కసారిగా జీవాలు మృత్యువాత పడటంతో వాటిపై ఆధారపడి జీవిస్తున్న కాపరులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతపట్నం మండలం కొరసవాడ గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు ఆదివారం తమ జీవాలను మేత కోసం సమీప ప్రాంతాలకు తోలుకెళ్లారు. ఈ క్రమంలో వంశధార జలాశయం ఎగువన ఉన్న సరుగుడు తోటలోకి గొర్రెలు, మేకలు ప్రవేశించాయి. అక్కడ పిచ్చి మొక్కలు, గడ్డి నివారణ కోసం కొద్దిరోజుల క్రితం పురుగుల మందు పిచికారీ చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.ఈ విషయం తెలియని జీవాలు మందు పిచికారీ చేసిన గడ్డి, ఆకులను మేయడంతో కొద్దిసేపటికే అస్వస్థతకు గురైనట్లు కాపరులు తెలిపారు. అనంతరం సుమారు 35 జీవాలు అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు.ఎన్నో ఏళ్లుగా గొర్రెలు, మేకల పెంపకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న తమకు ఈ ఘటన తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని బాధిత కాపరులు ఆవేదన వ్యక్తం చేశారు. కళ్లముందే జీవాలు విలవిలలాడుతూ మృతి చెందడం చూసి కన్నీరుమున్నీరయ్యారు. తమ కుటుంబాలకు జీవనాధారంగా ఉన్న జీవాలను కోల్పోవడంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయామని వాపోయారు.ఘటనపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి సంఘటనా స్థలాన్ని పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. మృతిచెందిన జీవాలకు అసలు కారణాలను పశువైద్య అధికారులు నిర్ధారించాలని, పురుగుల మందు పిచికారీ చేసిన ప్రాంతంలో జీవాలు మేయకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.జీవాలను కోల్పోయిన బాధిత కాపరులకు ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం, నష్టపరిహారం అందించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు. అధికారుల విచారణ అనంతరం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.