🏠 www.prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 04 October 2026, 11:40 am Posted by : Praja Nestham Jwala News

CNG నింపుతుండగా పేలుడు.. ముక్కలుముక్కలైన కారు

News Image
గుజరాత్ కర్జన్‌లోని ఓ CNG ఫిల్లింగ్ స్టేషన్‌లో కారు CNG నింపుతుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో Renault Triber కారు తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం.

CNG నింపుతున్న సమయంలో సిలిండర్ ఒక్కసారిగా బ్లాస్ట్ కావడంతో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. దీంతో కారు భాగాలు ఎగిరిపడగా, సమీపంలో ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ ఘటనలో ప్రాణనష్టం తప్పినట్లు సమాచారం.
పేలుడుకు గల ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
🏠 Home