ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలి
నేరేడుచర్ల: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి కుటుంబానికి నెలకు 6 కేజీల సన్నబియ్యం అందిస్తోందని నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ కొణతం వెంకటరెడ్డి అన్నారు. స్థానిక మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహకారంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్నామని తెలిపారు.
నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు నరసయ్యగూడెంలో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి చైర్మన్ ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజల అవసరాలను గుర్తించి వారికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ నన్నెపంగ శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు అలక శ్రవణ్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ తాళ్ల సురేష్‌రెడ్డి, ఆలంపల్లి బిక్షం, మొగరాల సత్యనారాయణ, నన్నెపంగ సందీప్, నన్నెపంగ శిరీష, నన్నెపంగ తిరుపమ్మ, మన్నెం ముత్యాలమ్మ, మొగరాల ప్రమీల, కనకమ్మతో పాటు వార్డు ప్రజలు పాల్గొన్నారు.