ఎర్రమ్మ గుట్ట ప్రభుత్వ భూమి.. కబ్జాదారులపై చర్యలేవి?
నడికూడ, అక్టోబర్ 04, 2026 (ప్రజానేస్తం జ్వాల):
నడికూడ గ్రామ శివారులోని సర్వే నంబర్ 525/1లో ఉన్న ఎర్రమ్మ గుట్ట ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురవుతోందని ఎర్రమ్మ తల్లి గుట్ట పరిరక్షణ సమితి ఆరోపించింది. ప్రభుత్వ భూమిలో కొందరు వ్యక్తులు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని, మతపరమైన నిర్మాణాలు కూడా కొనసాగుతున్నాయని సమితి పేర్కొంది.ఈ విషయంపై స్థానిక రెవెన్యూ అధికారులకు రెండు నెలల క్రితమే రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు తీసుకోలేదని సమితి ప్రతినిధులు తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే స్థలాన్ని పరిశీలించి, రికార్డుల ఆధారంగా భూమి హద్దులను నిర్ధారించి, ఆక్రమణలు ఉంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని వారు కోరారు.అధికారుల స్పందన లేకపోవడం వల్లే నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్న అనుమానాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయని సమితి తెలిపింది. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన రెవెన్యూ యంత్రాంగం ఈ అంశంపై తక్షణమే దృష్టి సారించాలని డిమాండ్ చేసింది.
📌 సమగ్ర సర్వేకు డిమాండ్
సర్వే నంబర్ 525/1లోని భూమిని అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించి, ప్రభుత్వ భూమి విస్తీర్ణం, హద్దులు, ప్రస్తుత పరిస్థితిని అధికారిక రికార్డుల ఆధారంగా నిర్ధారించాలని సమితి కోరింది. నిర్మాణాలకు అనుమతులు ఉన్నాయా? ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు జరుగుతున్నాయా? అనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
📌 కలెక్టర్ జోక్యం చేసుకోవాలి
ఎర్రమ్మ గుట్ట ప్రభుత్వ భూమిని పరిరక్షించేందుకు జిల్లా ఉన్నతాధికారులు, కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకోవాలని ఎర్రమ్మ తల్లి గుట్ట పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. ఆక్రమణలు, అనుమతుల్లేని నిర్మాణాలు ఉన్నట్లు అధికారిక విచారణలో తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.కె. మహేందర్, కన్వీనర్, ఎర్రమ్మ తల్లి గుట్ట పరిరక్షణ సమితి మాట్లాడుతూ.. ప్రభుత్వ భూమిని కాపాడేందుకు వెంటనే అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.