బీసీ హక్కుల సాధనకు ఐక్య ఉద్యమాలు అవసరం
📌 హైదరాబాద్ జిల్లా మహాసభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు
బీసీల హక్కులు, సమస్యల పరిష్కారానికి ఉద్యమాలను విస్తృతం చేయాలి
హైదరాబాద్, అక్టోబర్ 4 (ప్రజానేస్తం జ్వాల):బీసీల హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమాలను నిర్వహించాల్సిన అవసరం ఉందని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన బీసీ హక్కుల సాధన సమితి జిల్లా మహాసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.బీసీ వర్గాలు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక సమస్యలపై మహాసభలో చర్చించారు.
బీసీలకు రాజ్యాంగపరంగా లభించాల్సిన హక్కులు, విద్య, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యం, సంక్షేమం తదితర అంశాలపై మరింత సమర్థవంతమైన ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని వక్తలు పేర్కొన్నారు.మహాసభలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేష్, హైదరాబాద్ జిల్లా సీపీఐ సహాయ కార్యదర్శి కమతం యాదగిరి, గీత పనివారల సంఘం రాష్ట్ర కార్యదర్శి మారగోని ప్రవీణ్‌గౌడ్ పాల్గొని ప్రసంగించారు.
బీసీల సమస్యల పరిష్కారానికి వివిధ ప్రజా, కార్మిక, సామాజిక సంఘాలు సమన్వయంతో పనిచేయాలని వారు సూచించారు.ఈ మహాసభకు బాలయ్య యాదవ్ అధ్యక్షత వహించారు. జిల్లాలో బీసీ హక్కుల సాధన సమితి కార్యకలాపాలను విస్తృతం చేయడం, ప్రజలను చైతన్యపరచడం, బీసీల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడం తదితర అంశాలపై మహాసభలో చర్చించినట్లు తెలిపారు.