🏠 www.prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 04 October 2026, 8:09 pm Posted by : Praja Nestham Jwala News

632 మంది భూ భారతి ఆపరేటర్ల ఉద్యోగాలు పునరుద్ధరించాలి

News Image
📌 ఉద్యోగ భద్రత కల్పించి సేవలను కొనసాగించాలి
రాష్ట్ర కమిటీ ఏర్పాటు.. హక్కుల సాధనకు ఐక్య పోరాటం
రాష్ట్ర అధ్యక్షులుగా చిన్ని కృష్ణ (మేడ్చల్‌–మల్కాజిగిరి), శివకుమార్‌ (రంగారెడ్డి)
ఉపాధ్యక్షులుగా అనిల్‌ (నాగర్‌కర్నూల్‌), సలీమ్‌ (సూర్యాపేట), ప్రధాన కార్యదర్శులుగా ప్రసన్న, శివ చౌహాన్‌లను ఎంపిక చేశారు
హైదరాబాద్‌, అక్టోబర్‌ 4 (ప్రజానేస్తం జ్వాల): రాష్ట్రవ్యాప్తంగా భూ భారతి కార్యక్రమంలో సేవలందిస్తున్న 632 మంది ఆపరేటర్ల ఉద్యోగాలను పునరుద్ధరించి, వారి సేవలను కొనసాగించాలని భూ భారతి ఆపరేటర్స్‌ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఉద్యోగ భద్రత, జీతాల భద్రత కల్పించడంతో పాటు తమ సేవలకు తగిన గుర్తింపు ఇవ్వాలని కోరింది.
భూ భారతి వ్యవస్థలో ఆపరేటర్లు కీలక సేవలు అందిస్తున్న నేపథ్యంలో వారి ఉద్యోగాలను కొనసాగించడం ద్వారా ప్రజలకు రెవెన్యూ సేవలు మరింత సులభంగా అందుబాటులో ఉంటాయని కమిటీ పేర్కొంది. ఉద్యోగాలపై అనిశ్చితి తొలగించి సర్వీస్‌ రెన్యూవల్‌ (పునరుద్ధరణ)కు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది.
ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆపరేటర్లను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు భూ భారతి ఆపరేటర్స్‌ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్ర అధ్యక్షులుగా చిన్ని కృష్ణ (మేడ్చల్‌–మల్కాజిగిరి), శివకుమార్‌ (రంగారెడ్డి), ఉపాధ్యక్షులుగా అనిల్‌ (నాగర్‌కర్నూల్‌), సలీమ్‌ (సూర్యాపేట), ప్రధాన కార్యదర్శులుగా ప్రసన్న, శివ చౌహాన్‌లను ఎంపిక చేశారు.
ఆపరేటర్ల ఉద్యోగ పునరుద్ధరణ, ఉద్యోగ భద్రత, జీతాల భద్రత, హక్కుల సాధన కోసం ప్రభుత్వంపై ప్రజాస్వామ్య పద్ధతిలో ఒత్తిడి తీసుకురావాలని కమిటీ నిర్ణయించింది. “భూ భారతి ఆపరేటర్స్‌ ఐక్యత – మన బలం” అనే నినాదంతో ఐక్యంగా ఉద్యమించనున్నట్లు తెలిపింది.
🏠 Home