🏠 www.prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 06 October 2026, 4:57 pm Posted by : Praja Nestham Jwala News

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కార్యదర్శి, కారోబార్‌

News Image
📌 ఇంటి మార్పు ధ్రువీకరణ కోసం రూ.15 వేల డిమాండ్‌.. జక్కాపూర్‌ పంచాయతీ కార్యాలయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ

సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలంలో ఘటన

సిద్దిపేట జిల్లా, అక్టోబర్‌ 6 (ప్రజానేస్తం జ్వాల):లంచం తీసుకుంటూ గ్రామపంచాయతీ కార్యదర్శి, కారోబార్‌ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన ఘటన సిద్దిపేట జిల్లాలో కలకలం రేపింది. నారాయణరావుపేట మండలం జక్కాపూర్‌ గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.

ఇంటి మార్పు విషయంలో అవసరమైన ప్రక్రియ కోసం రూ.15 వేల లంచం తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శి అరుణ, కారోబార్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం. ముందస్తు సమాచారంతో ఏసీబీ అధికారులు పంచాయతీ కార్యాలయానికి చేరుకుని లంచం తీసుకుంటున్న సమయంలో వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

లంచం డిమాండ్‌ చేసినట్లు బాధితుడి నుంచి అందిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు వెల్లడించాల్సి ఉంది.

ఏసీబీ దాడితో జక్కాపూర్‌ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.లంచం వ్యవహారంపై అధికారులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.
🏠 Home