🏠 www.prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 09 October 2026, 7:00 am Posted by : Praja Nestham Jwala News

కీతవారిగూడెం గ్రామంలో 33 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ

News Image

మిగిలిన 37 మంది లబ్ధిదారులకు త్వరలో అందజేస్తాం: ఎస్కే చాంద్ మియా


కీతవారిగూడెం, అక్టోబర్ 8 (ప్రజానేస్తం జ్వాల):గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామంలోని ఎస్సీ కాలనీలో 33 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్కే చాంద్ మియా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు.ఈ సందర్భంగా చాంద్ మియా మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.కీతవారిగూడెంలో మొత్తం 70 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, ప్రస్తుతం 33 మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేశామని, మిగిలిన 37 మంది లబ్ధిదారులకు కూడా త్వరలో పట్టాలు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. పేదల సంక్షేమం, గ్రామ అభివృద్ధి కోసం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు.కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జానకమ్మ, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు కీత సోమయ్య, ఉపసర్పంచ్ చిత్తలూరు వీరస్వామి, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామ పెద్దలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home