నేరేడుపల్లిలో భూముల రీసర్వే ప్రారంభం
క్షేత్రస్థాయిలో భూ వివరాల పరిశీలన.. పత్రాలతో రైతులు సహకరించాలి: తహశీల్దార్ ప్రవీణ్ కుమార్
నేరేడుపల్లి, అక్టోబర్ 9 (ప్రజానేస్తం జ్వాల):హనుమకొండ జిల్లా శాయంపేట మండలం నేరేడుపల్లి గ్రామంలో భూముల రీసర్వే కార్యక్రమాన్ని తహశీల్దార్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. భూముల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, భూ రికార్డులను సరిచూసేందుకు రీసర్వే చేపట్టినట్లు తెలిపారు.రీసర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, భూములకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేయాలని తహశీల్దార్ సిబ్బందికి సూచించారు. రీసర్వే సమయంలో రైతులు, భూయజమానులు తమ భూములకు సంబంధించిన పత్రాలు, వివరాలను అధికారులకు అందించి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో అదనపు గిర్దావర్ రమేష్, గ్రామపాలనాధికారి రవి, సర్వేయర్ రఘుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.