🏠 www.prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 09 October 2026, 5:18 pm Posted by : Praja Nestham Jwala News

రోడ్డు ప్రమాదంలో గాయపడిన కానిస్టేబుల్ దిలీప్‌కు పరామర్శ

News Image

యశోద ఆసుపత్రికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న గండ్ర వెంకట రమణారెడ్డి, గండ్ర జ్యోతి
భూపాలపల్లి, అక్టోబర్‌ 9 (ప్రజానేస్తం జ్వాల):రోడ్డు ప్రమాదంలో గాయపడి సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ దిలీప్‌ను భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, వరంగల్‌ జిల్లా పరిషత్‌ మాజీ చైర్‌పర్సన్‌, భూపాలపల్లి జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పరామర్శించారు.గతంలో గండ్ర వెంకట రమణారెడ్డి వద్ద గన్‌మెన్‌గా పనిచేసిన కానిస్టేబుల్ దిలీప్‌.. భూపాలపల్లి హెడ్‌క్వార్టర్స్‌లో విధులు ముగించుకుని హనుమకొండకు వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురై గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఆసుపత్రికి వెళ్లిన గండ్ర వెంకట రమణారెడ్డి, గండ్ర జ్యోతి దిలీప్‌ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. దిలీప్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కష్టకాలంలో కుటుంబ సభ్యులు అధైర్యపడవద్దని, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
🏠 Home