🏠 www.prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 09 October 2026, 5:35 pm Posted by : Praja Nestham Jwala News

హనుమకొండలో సైబర్‌ భద్రతా పాఠాలు.. 2,500 మంది విద్యార్థులకు అవగాహన

News Image
భీమారం, హనుమకొండ (ప్రజానేస్తం జ్వాల): విద్యార్థులు సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆన్‌లైన్‌ మోసాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌. శ్వేత, ఐపీఎస్‌ మార్గదర్శకత్వంలో సెంట్రల్‌ జోన్‌ డీసీపీ దారా కవిత, ఏసీపీ నరసింహరావు ఆధ్వర్యంలో కేయూసీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని భీమారం ఎస్‌వీఎస్‌ కళాశాలలో సైబర్‌ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కేయూసీ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ ఎస్‌. రవికుమార్‌, ఎస్‌ఐ శ్రావణితో పాటు ఇతర ఎస్‌ఐలు పాల్గొన్నారు. వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన సుమారు 2,500 మంది విద్యార్థులకు సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆన్‌లైన్‌ మోసాలు, నకిలీ లింకులు, సోషల్‌ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యక్తిగత సమాచార భద్రత, సైబర్‌ నేరాల నుంచి రక్షణ పొందే మార్గాల గురించి విద్యార్థులకు వివరించారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌, సందేశాలు, అనుమానాస్పద లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఎవరైనా సైబర్‌ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు. విద్యార్థుల్లో సైబర్‌ భద్రతపై అవగాహన పెంపొందించి, ఆన్‌లైన్‌ మోసాల నుంచి వారిని రక్షించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు.

– ప్రజానేస్తం జ్వాల, హనుమకొండ ప్రతినిధి
🏠 Home