🏠 www.prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 09 October 2026, 6:15 pm Posted by : Praja Nestham Jwala News

కీతవారిగూడెంలో నకిలీ ఫోన్‌పేతో మోసం!

News Image

రూ.9,500 విలువైన సిగరెట్లు కొనుగోలు చేసి మాయమైన ఇద్దరు వ్యక్తులు

దుకాణంలో మహిళలే ఉండటాన్ని ఆసరాగా చేసుకున్నట్లు సమాచారం.. పోలీసుల విచారణ


గరిడేపల్లి, అక్టోబర్ 9 (ప్రజానేస్తం జ్వాల):
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెంలో నకిలీ ఫోన్‌పే చెల్లింపుతో మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని మెయిన్‌ రోడ్డుపై ఉన్న ఓ కిరాణా దుకాణంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు సుమారు రూ.9,500 విలువైన సిగరెట్లు కొనుగోలు చేసి, నకిలీ ఫోన్‌పే చెల్లింపు ద్వారా దుకాణదారులను మోసం చేసినట్లు తెలిసింది.
దుకాణంలో మహిళలు మాత్రమే ఉన్న సమయంలో పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకుని ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. ఫోన్‌పే ద్వారా డబ్బులు చెల్లించినట్లు చూపించి సిగరెట్లు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. అనంతరం నగదు జమ కాలేదని గుర్తించడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది.ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇద్దరు వ్యక్తులను గుర్తించేందుకు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.

డిజిటల్ చెల్లింపులపై అప్రమత్తత అవసరం

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వ్యాపారులు డిజిటల్ చెల్లింపుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఫోన్‌పే చెల్లింపు విజయవంతమైనట్లు చూపించే స్క్రీన్‌షాట్‌లు లేదా సందేశాలను మాత్రమే నమ్మకుండా, తమ బ్యాంకు ఖాతాలో నగదు జమ అయినట్లు నిర్ధారించుకోవాలి.
🏠 Home