🏠 www.prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 09 October 2026, 7:09 pm Posted by : Praja Nestham Jwala News

రఘునాథపాలెంలో డబ్బులతో జూదం.. తొమ్మిది మంది అరెస్ట్

News Image

రూ.15,200 నగదు, ఆరు ద్విచక్ర వాహనాలు, సెల్‌ఫోన్‌ స్వాధీనం


మఠంపల్లి, అక్టోబర్‌ 9 (ప్రజానేస్తం జ్వాల):సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామ శివారులో డబ్బులతో జూదం ఆడుతున్న తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మఠంపల్లి ఎస్‌ఐ బి. ప్రవీణ్‌కుమార్‌ తన సిబ్బందితో కలిసి దాడి నిర్వహించి, వారి వద్ద నుంచి రూ.15,200 నగదు, ఆరు ద్విచక్ర వాహనాలు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, జూదంలో పాల్గొన్న ఇతరుల వివరాలపై దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు.
🏠 Home