ఎండిన బోర్లకు పునర్జీవం.. భూగర్భ జలాల పెంపునకు బోర్ రీఛార్జ్ పనులు ప్రారంభం
వేలేరు, అక్టోబర్ 14 (ప్రజా నేస్తం జ్వాల): భూగర్భ జలాల పరిరక్షణ, నీటి వనరుల పునరుద్ధరణ లక్ష్యంగా వేలేరు మండల కేంద్రంలో బోర్ రీఛార్జ్ పనులను ప్రారంభించారు. VBG-RAM-G పథకంలో భాగంగా వేలేరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో ఎండిపోయిన బోర్లకు తిరిగి జీవం పోసేందుకు చేపట్టిన ఈ పనులను గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి, మండల ఎంపీడీవో కిషన్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బిల్లా యాదగిరి, ఎంపీడీవో కిషన్ నాయక్ మాట్లాడుతూ, భూగర్భ జలాల వినియోగం పెరగడం, వర్షపాతం లోపించడం వంటి కారణాలతో అనేక ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు తగ్గిపోయి బోర్లు ఎండిపోతున్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యను అధిగమించి భూగర్భ జలాలను పెంపొందించేందుకు బోర్ రీఛార్జ్ పనులు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.
VBG-RAM-G పథకంలో భాగంగా వేలేరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో ఎండిపోయిన బోర్ల వద్ద రీఛార్జ్ పనులు చేపడుతున్నట్లు సర్పంచ్ వెల్లడించారు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేయడం ద్వారా భూగర్భ జలాల మట్టాన్ని పెంచేందుకు, భవిష్యత్తులో నీటి ఎద్దడిని తగ్గించేందుకు ఈ పనులు దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు శ్రీనివాస్, రాజు, అరుణ నాగరాజు, వేలేరు ఉపసర్పంచ్ శ్రీకర్, VBG-RAM-G టీఏ ప్రదీప్, సతీష్, వార్డు సభ్యుడు రణధీర్ రెడ్డి, ఆత్మ డైరెక్టర్ చంద్రమౌళి, శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు.