🏠 www.prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 14 October 2026, 3:10 pm Posted by : Praja Nestham Jwala News

సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

News Image
వేలేరు, అక్టోబర్‌ 14 (ప్రజా నేస్తం జ్వాల): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ, విజయదశమి (దసరా) పండుగలను ఘనంగా నిర్వహించేందుకు వేలేరు మండల కేంద్రంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించనున్న వేడుకల కోసం వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి ఆధ్వర్యంలో ఏర్పాట్ల పనులను ప్రారంభించారు. పండుగలను సంప్రదాయబద్ధంగా, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నారు. గ్రామ ప్రజలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనేలా వేడుకలను విజయవంతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, పూల పండుగ వైభవానికి ప్రతీక కాగా, దసరా చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా నిలుస్తుంది. ఈ ఏర్పాట్ల పనుల ప్రారంభ కార్యక్రమంలో వేలేరు ఉపసర్పంచ్ శ్రీకర్, ఆత్మ డైరెక్టర్ చంద్రమౌళి, సతీష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home