🏠 www.prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 14 October 2026, 3:12 pm Posted by : Praja Nestham Jwala News

విద్యుత్ సబ్‌స్టేషన్ల ఆధునీకరణకు శ్రీకారం

News Image
ముఖ్యమైన పాయింట్స్:టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో 485 సబ్‌స్టేషన్లలో పనులు.. నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సీఎండీ ఆదేశాలు
హనుమకొండ, అక్టోబర్‌ 14 (ప్రజానేస్తం జ్వాల): విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత పటిష్టం చేసి, వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలోని పాత విద్యుత్ సబ్‌స్టేషన్ల ఆధునీకరణ, సమగ్ర మరమ్మతు పనులను వేగవంతం చేసినట్లు సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. సంస్థ పరిధిలోని 17 సర్కిళ్లలో మొత్తం 485 పాత విద్యుత్ సబ్‌స్టేషన్లలో ఈ పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ నెల 4వ తేదీ నాటికి 145 సబ్‌స్టేషన్లలో సివిల్ పనులు, మరో 65 ప్రాంతాల్లో ఎలక్ట్రికల్ పనులు విజయవంతంగా పూర్తయినట్లు సీఎండీ వివరించారు. పనుల అమలులో భాగంగా ప్రాజెక్ట్స్ వింగ్ ద్వారా 68, ఆపరేషన్ వింగ్ ద్వారా 417 ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు.

పాత సబ్‌స్టేషన్ల ఆధునీకరణతో విద్యుత్ పంపిణీ వ్యవస్థ సామర్థ్యం మెరుగుపడటంతో పాటు, విద్యుత్ సరఫరాలో అంతరాయాలను తగ్గించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు చేపట్టిన ఈ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులకు సూచించారు. మిగిలిన పనులన్నింటినీ నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. విద్యుత్ వ్యవస్థను ఆధునీకరించడం ద్వారా ప్రజలకు మరింత నాణ్యమైన, విశ్వసనీయమైన విద్యుత్ సేవలు అందించేందుకు సంస్థ కృషి చేస్తోందని పేర్కొన్నారు.
🏠 Home