రామగిరి వద్ద రోడ్డు ప్రమాదం.. ఎస్సై సతీష్ కుమార్కు తీవ్ర గాయాలు
మిర్యాలగూడ టూ టౌన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్సైకి ప్రమాదం.. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తరలింపు
నేరేడుచర్ల, అక్టోబర్ 14 (ప్రజానేస్తం జ్వాల): సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రామగిరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్సై సతీష్ కుమార్ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఆయన నేరేడుచర్ల మండలం కందులవారిగూడెం గ్రామానికి చెందినవారని, ప్రస్తుతం మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారని తెలిసింది.ప్రమాదంలో గాయపడిన సతీష్ కుమార్ను 108 అంబులెన్స్లో మిర్యాలగూడలోని లీలా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించినట్లు సమాచారం.ప్రమాదానికి గల కారణాలు, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.