🏠 www.prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 15 October 2026, 4:58 am Posted by : Praja Nestham Jwala News

అన్నప్రసాద వితరణలో శ్రీ గణేశ దుర్గ భవాని అసోసియేషన్

News Image
అమ్మవారి సన్నిధిలో ఎస్సై రాజు.. ఉత్సవాల ఏర్పాట్లపై ప్రశంసలు

భీమదేవరపల్లి, అక్టోబర్ 14, ప్రజా నేస్తం జ్వాల:- శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు వివేకానంద యూత్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు అమ్మవారు చండీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.బుధవారం శ్రీ గణేశ దుర్గ భవాని అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముల్కనూర్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ ఎం. రాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అమ్మవారి సన్నిధికి చేరుకున్న ఎస్సై రాజుకు వివేకానంద యూత్ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా వివేకానంద యూత్ సభ్యులు ఎస్సై రాజును శాలువాతో సన్మానించారు. ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన అలంకరణలు, డెకరేషన్‌ను ఎస్సై రాజు అభినందించారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టిన శ్రీ గణేశ దుర్గ భవాని అసోసియేషన్ సభ్యులకు వివేకానంద యూత్ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
🏠 Home