🏠 www.prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 15 October 2026, 5:04 am Posted by : Praja Nestham Jwala News

నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శికి బీజేపీ ఆధ్వర్యంలో సన్మానం

News Image
భీమదేవరపల్లి(ప్రజానేస్తం జ్వాల): మండల ప్రెస్ క్లబ్(రి.నె 629/22) నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మాడుగుల రాజకుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన మాడుగుల రామకృష్ణను బీజేపీ నాయకులు బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారికి శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడానికి ప్రెస్ క్లబ్ కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పైడిపల్లి పృథ్వీరాజ్, దొంగల కొమురయ్య, ఊస కోయిల కిషన్, దొంగల వేణు, రానా ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home