🏠 www.prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 15 October 2026, 11:49 am Posted by : Praja Nestham Jwala News

నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్‌ఐ ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన వేలేరు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు

News Image
వేలేరు, అక్టోబర్‌ 15 (ప్రజానేస్తం జ్వాల ప్రతినిధి మాలోత్ శ్రీను): వేలేరు మండల పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్‌ఐ దుదిమెట్ల నరేష్‌ను మండల కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏఎంసీ డైరెక్టర్‌, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కత్తి సంపత్‌ ఎస్‌ఐ నరేష్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కత్తి సంపత్‌ మాట్లాడుతూ వేలేరు మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు ఎస్‌ఐ నరేష్‌ ఆధ్వర్యంలో సమర్థవంతమైన చర్యలు కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన పదవీకాలం విజయవంతంగా కొనసాగాలని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేలేరు మండల యూత్‌ కాంగ్రెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అత్తేన రాజేందర్‌, యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు తూముల ప్రశాంత్‌, జుర్రు శ్రావణ్‌, జుర్రు హరీష్‌, ఎస్‌కే పాషా, రాజు, అఖిల్‌, సేవాదళ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home