🏠 www.prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 15 October 2026, 7:38 pm Posted by : Praja Nestham Jwala News

40 ఏళ్ల తర్వాత ఆత్మీయ కలయిక.. పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

News Image

గురువులకు ఘన సన్మానం.. పాఠశాలకు రూ.10 వేల పోడియం బహూకరణ


గరిడేపల్లి, అక్టోబర్ 15 (ప్రజానేస్తం జ్వాల):నాలుగు దశాబ్దాల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆత్మీయంగా గడిపారు. గడ్డిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో 1984–85 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు గురువారం అపూర్వ సమ్మేళనం నిర్వహించుకున్నారు.
ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన నాటి ఉపాధ్యాయులు రామినేని సత్యం, వెంకయ్య, జానీ మియా, వీరారెడ్డి, రమేష్, కృష్ణారెడ్డితో పాటు పలువురిని ఘనంగా సన్మానించారు. తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధికి రూ.10 వేల విలువైన పోడియంను బహూకరించి తమ గురుభక్తిని, పాఠశాలపై మమకారాన్ని చాటుకున్నారు. నాలుగు దశాబ్దాల తర్వాత మిత్రులు, గురువులు ఒకే వేదికపై కలుసుకోవడంతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది.
🏠 Home