108 అత్యవసర సేవలను సద్వినియోగం చేసుకోవాలి
భీమదేవరపల్లి, అక్టోబర్ 15 (ప్రజానేస్తం జ్వాల): అత్యవసర వైద్య పరిస్థితుల్లో 108 అంబులెన్స్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ జిల్లా 108 అత్యవసర సేవల మేనేజర్ మండ శ్రీనివాస్ సూచించారు. ప్రజలకు సకాలంలో వైద్య సహాయం అందించడంలో 108 సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం భీమదేవరపల్లి మండలంలో నిర్వహిస్తున్న 108 అంబులెన్స్‌ను ఆయన తనిఖీ చేశారు. అంబులెన్స్‌లోని వైద్య పరికరాలు, నిర్వహణ తీరును పరిశీలించడంతో పాటు రికార్డులను తనిఖీ చేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు 756 మంది ప్రాణాలను కాపాడటంలో సేవలందించిన సిబ్బందిని అభినందించారు.
అత్యవసర పరిస్థితుల్లో 108కు కాల్ చేయండి
ఈ సందర్భంగా జిల్లా మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. వర్షాకాలంలో విషపురుగుల కాట్లు, సీజనల్ వ్యాధులు, రోడ్డు ప్రమాదాలు, విద్యుత్ ప్రమాదాలు, గర్భిణులకు ఎదురయ్యే అత్యవసర వైద్య సమస్యలు వంటి సందర్భాల్లో ప్రజలు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించాలని సూచించారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్ సిబ్బంది అందించే ప్రాథమిక వైద్య సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజలకు నాణ్యమైన అత్యవసర వైద్య సేవలు అందించేందుకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అంబులెన్స్‌లో అవసరమైన వైద్య పరికరాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, రికార్డులను క్రమబద్ధంగా నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు డాక్టర్ మునీర్, 108 ఈఎంటీలు రేణికుంట్ల విద్యాసాగర్, మేకల రవి, తేజస్విని, అంబులెన్స్ పైలెట్లు కృష్ణంరాజు, సంపత్ తదితరులు పాల్గొన్నారు.