🏠 www.prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 15 October 2026, 10:09 pm Posted by : Praja Nestham Jwala News

ఆయిల్‌ఫామ్‌ సాగుపై రైతులకు అవగాహన సదస్సు

News Image
భీమదేవరపల్లి, అక్టోబర్ 15 (ప్రజానేస్తం జ్వాల): ఆయిల్‌ఫామ్‌ సాగులో సరైన పోషక యాజమాన్యం, నీటి వినియోగం, చీడపీడల నివారణ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు గురువారం భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ సహకార సంఘం ప్రధాన కార్యాలయంలో సదస్సు నిర్వహించారు. ఏరిస్ ఆగ్రో లిమిటెడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పంట దిగుబడిపై ప్రభావం చూపే వివిధ అంశాలను వివరించారు. సందర్భంగా సంస్థ రీజినల్ మేనేజర్ రాజారెడ్డి మాట్లాడుతూ.. ఆయిల్‌ఫామ్‌ పంటకు అవసరమైన పోషకాలను తగిన మోతాదుల్లో అందించడం ద్వారా మొక్కల ఎదుగుదలకు తోడ్పడవచ్చని తెలిపారు. నేల స్వభావం, పంట వయస్సు, పోషకాల అవసరాలను పరిగణనలోకి తీసుకొని ఎరువుల వినియోగంపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

పంటలో బోరాన్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాల లోపాలను గుర్తించడం, వాటి నివారణకు తగిన చర్యలు చేపట్టడం గురించి రైతులకు వివరించారు. అలాగే నీటి యాజమాన్యం, పోషకాల సమతుల్య వినియోగం, కీటకాలు, తెగుళ్లను గుర్తించి నియంత్రించే పద్ధతులపై అవగాహన కల్పించారు. పంట అవసరాలకు అనుగుణంగా సాగు పద్ధతులను అనుసరించాలని, ఎరువులు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను వ్యవసాయ నిపుణుల సూచనల మేరకు వినియోగించాలని ఈ సందర్భంగా సూచించారు. సదస్సులో ఆయిల్‌ఫామ్‌ సాగుకు సంబంధించిన పోషక యాజమాన్యం, పంట సంరక్షణ అంశాలపై రైతులకు వివరించారు.
🏠 Home