🏠 www.prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 31 October 2026, 2:39 pm Posted by : Praja Nestham Jwala News

అనంతపురం రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో దారుణం

News Image
పదో తరగతి విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి.. చేయి తెగి, గొంతుకు తీవ్ర గాయాలు!

అనంతపురం,అక్టోబర్ 31(ప్రజానేస్తం జ్వాల): అనంతపురం జిల్లా రాప్తాడులోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినిపై జరిగిన దాడి తీవ్ర కలకలం రేపింది. పదో తరగతి తరగతి గదిలోకి ప్రవేశించిన ఓ యువకుడు విద్యార్థిని గోపికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసినట్లు ప్రాథమిక సమాచారం.

ఈ దాడిలో బాలిక చేయి తెగిపోగా, గొంతుకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనతో పాఠశాల ప్రాంగణంలో భయాందోళనలు నెలకొన్నాయి.

పాఠశాల నిర్మాణ పనుల నిమిత్తం వచ్చిన వ్యక్తే ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని ఉపాధ్యాయులు అనుమానిస్తున్నట్లు సమాచారం. అయితే నిందితుడి వివరాలు, దాడికి గల కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.
🏠 Home