హనుమకొండ ప్రజలకు విద్యుత్ అలర్ట్.. పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరాకు అంతరాయం!
హనుమకొండ, నవంబర్ 14 (ప్రజానేస్తం జ్వాల): విద్యుత్ లైన్ల అభివృద్ధి, మరమ్మతు పనుల నేపథ్యంలో ఆదివారం హనుమకొండ నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనుంది. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ డీఈ సాంబారెడ్డి వెల్లడించారు. 11 కేవీ స్విచ్‌ల ఏర్పాటు పనుల కారణంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నక్కలగుట్ట మెయిన్ రోడ్డు, బాలసముద్రం, రాంనగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. అదేవిధంగా 33 కేవీ నయీంనగర్ ఫీడర్ పరిధిలో మరమ్మతు పనుల దృష్ట్యా ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు డ్రీమ్‌ల్యాండ్ ఫంక్షన్ హాల్, పెద్దమ్మగడ్డ, కాకతీయ కాలనీ ఫేజ్-2 ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు.