ఉమ్మడి వరంగల్ జిల్లాకు 55,798 నూతన పింఛన్లు మంజూరు
హనుమకొండ, నవంబర్ 15 (ప్రజానేస్తం జ్వాల): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన నిరుపేదలకు కొత్తగా 4.63 లక్షల పింఛన్లు మంజూరు చేసేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలపడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రయోజనం చేకూరింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 55,798 మందికి నూతన పింఛన్లు మంజూరయ్యాయి. ఈ నెల 19వ తేదీ నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో పింఛన్ నగదు జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
మంజూరైన పింఛన్ల వివరాల ప్రకారం 31,775 మంది వితంతువులు, 13,407 మంది దివ్యాంగులు, 4,731 మంది ఒంటరి మహిళలు, 5,062 మంది గీత కార్మికులు, 823 మంది చేనేత కార్మికులు లబ్ధి పొందనున్నారు. దీర్ఘకాలంగా కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన పేదలకు ఈ నిర్ణయం ప్రయోజనం చేకూర్చనుంది. నూతన పింఛన్ల మంజూరుతో లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి.