🏠 www.prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 15 November 2026, 10:50 pm Posted by : Praja Nestham Jwala News

అప్పన్నపేట వద్ద మృత్యుఘోష.. లారీని ఢీకొన్న బైక్.. భర్త మృతి, భార్య పరిస్థితి విషమం!

News Image
గరిడేపల్లి, నవంబర్ 15 (ప్రజానేస్తం జ్వాల): గరిడేపల్లి మండలం అప్పన్నపేట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో భర్త ప్రాణాలు కోల్పోగా, భార్య తీవ్ర గాయాలతో మృత్యువుతో పోరాడుతోంది. ఈ ప్రమాదంలో హుజూర్‌నగర్‌కు చెందిన వంట మాస్టర్ షేక్ నజీర్ మృతి చెందగా, ఆయన భార్య హుస్సేన్ బికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే హుజూర్‌నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

కల్లేపల్లి మైసమ్మ వద్ద వంట కార్యక్రమం ముగించుకుని భార్యాభర్తలు బైక్‌పై తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం. ఒకే ప్రమాదంలో భర్త మృతి చెందడం, భార్య ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో ఉండటంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
🏠 Home