ఎస్ ఐ ఆర్ పై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలి. విదేశీయురాలు ఎస్ ఐ ఆర్ పై ధర్నాలో పాల్గొనడం చట్టరీత్యా నేరం. భారత పౌరసత్వం లేని విదేశీయురాలు చేస్తున్న పనిని ప్రశ్నిస్తూ న్యాయపోరాటం చేస్తాం. బిజెపి జిల్లా అధ్యక్షులు సౌ
ఎస్ఐఆర్ పై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొడుతూ ప్రజలకు వాస్తవాలు,నిజానిజాలు తెలియజేసే భాద్యత ప్రతీ బీజేపీ కార్యకర్త పై ఉందని.. ఎస్ఐఆర్ కార్యక్రమం పై విదేశీయురాలు ధర్నాలో పాల్గొనడం చట్టరీత్యా నేరమని, భారత పౌరసత్వం లేని వ్యక్తి చేసిన పనులను ప్రశ్నిస్తూ న్యాయపోరాటం చేస్తామని బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్, బిజెపి రాష్ట్ర నాయకులు లేగ రామ్మోహన్ రెడ్డి లు అన్నారు. ఆదివారం తొర్రూరు పట్టణంలో స్థానిక కిరాణ మర్చంట్స్ ఫంక్షన్ హాల్ నందు' మేధావుల సంగోష్ఠి 'కార్యక్రమం బీజేపి జిల్లా ఉపాధ్యక్షులు పల్లె కుమార్ యాదవ్ సభాధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సౌడ రమేష్, లేగ రాంమోహన్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హజరై మాట్లాడుతూ ఓట్ చోరి అంటూ అబద్ధాలు ప్రచారం చేస్తూ భారత ప్రజాస్వామ్య వ్యవస్థ లను, రాజ్యాంగ బద్ద సంస్థలను బ్లాక్ మేయిలింగ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతూ భారత ప్రతిష్టను అప్రతిష్ట పాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ అరాచకాన్ని ప్రజలు అసహ్యించు కుంటున్నారని, ప్రజల మనసులను గెలుచుకొని,ప్రజలు వేసిన ఓట్లతో గెలిచిన ప్రభుత్వాన్ని కూలదోయాలని కాంగ్రెస్ సహా వివక్షాలు మరియు విధేశీ నిధులతో నడిచే కొన్ని సంస్థలు కుయుక్తులు పన్నుతూ డిల్లీ నడి వీధుల్లో అరాచకానికి పాల్పడుతూ ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని అన్నారు. నరేంద్ర మోడీ లాంటి శక్తివంతమైన నాయకత్వం ముందు ప్రతి పక్షాల కుట్రలు విదేశీయుల కుయుక్తులు ఏమీ పనిచేయలేవని, ధేశం కోసం అహర్నిశలు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్న నరేంద్ర మోడీ పై ప్రజల్లో బలమైన విశ్వాసం, నమ్మకం ఉందని, నరేంద్ర మోడీ ఓట్ చోరీ చేయలేదని, ప్రజల హ్రృదయాలను, మనసులను మాత్రమే చోరీ చేశారని తెలిపారు. మాట్లాడుతూ ఎస్ఐఆర్ పై కాంగ్రెస్ పార్టీ విష ప్రచారాన్ని మానుకోవాలని, విదేశీ పౌరసత్వం కలిగి భారత పౌరసత్వం లేని ఝాన్సీ రెడ్డి ఎస్ఐఆర్ పై ధర్నా చేయడం నేరమని, ఒక విధేశీయురాలు భారత ప్రజాస్వామ్య వ్యవస్థ లను ప్రశ్నించడం భారత చట్టాలను ఉల్లంఘించడమేనని, దీనిపై బీజేపీ ఆధ్వర్యంలో న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. విధేశీయులతో భారత సార్వభౌమాధికారాన్ని ధిక్కరించే విధంగా వ్యవహరిస్తున్న రాహుల్ గాంధీ,రేవంత్ రెడ్డి లకు ప్రజల చేతిలో ఛీత్కారాలు తప్ప సత్కారాలు ఉండవని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్రంలో, దేశంలో భంగపాటు తప్పదు అని,అధికారం కల అని ఎద్దేవా చేశారు. ఈసమావేశంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రంగు రాములు, చింతా స్రృజన్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొలుపుల శంకర్, సర్పంచ్, ఉప సర్పంచ్ ప్రశాంత్, విశాల్, తొర్రూరు రూరల్, పెద్ద వంగర, కొడకండ్ల మండలాల అధ్యక్షులు గట్టు రాంబాబు, భాస్కరా చారి, పులిగిల్ల ఉపేందర్, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు అలిసేరి రవిబాబు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రచ్చ కుమార్, జిల్లా కార్యదర్శి సాయిని ఝాన్సీ, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు వడ్లకొండ రవి,ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు లకావత్ రవి నాయక్, ఎండోమెంట్ సెల్ జిల్లా కో -కన్వీనర్ భాషిపాక సుధాకర్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పెండ్యాల గణేష్, మండల ప్రధాన కార్యదర్శులు నడిగడ్డ సందీప్, భాస్కర్ నాయక్, ధేవరాజ్, నిమ్మల సంపత్ యాదవ్, భరత్, గంధం రాజు, శ్రీనివాస్, శ్రీనాథ్,రాపాక రమాదేవి, శ్రీకాంత్, కిన్నెర వెంకన్న, కన్నయ్య, నవీన్, కిన్నెర రాజ కుమార్, చిన్నాల వాసు, బొచ్చు సురేష్,సందీప్, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.