విద్యతో పాటు స్వయం రక్షణ కోసం కరాటే శిక్షణతో బాలికలకు ఆత్మస్థైర్యం నింపడమే వికాస్ పాఠశాల లక్ష్యం. వికాస్ పాఠశాల కరస్పాండెంట్ తాళ్లపల్లి రమేష్..
ముఖ్యమైన పాయింట్స్:వికాస్ పాఠశాల కరస్పాండెంట్ తాళ్లపల్లి రమేష్.ఆల్ ఇండియా కరాటే పోటీలలో వికాస్ పాఠశాల జయకేతనం ఎగుర వేసిన విద్యార్థులకు సన్మానం.
తొర్రూరు, మహబూబాబాద్ జిల్లా నవంబర్ 23 ప్రజానేస్తం జ్వాల//
వికాస్ పాఠశాలలో విద్యతోపాటు ఆత్మరక్షణ కోసం కరాటే శిక్షణతో బాలికలకు ఆత్మస్థైర్యాన్ని నింపడమే వికాస్ పాఠశాల లక్ష్యమని.. అందుకే ఆల్ ఇండియా కరాటే ఛాంపియన్షిప్ 2026లో వికాస్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారని పాఠశాల కరస్పాండెంట్ తాళ్లపల్లి రమేష్ అన్నారు. ఆల్ ఇండియా కరాటే ఛాంపియన్ షిప్ - 2026 లో భాగంగా నిర్వహించిన కరాటే పోటీలలో వికాస్ పాఠశాల విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్న డి.యశస్విని అండర్ 14 ఇయర్స్ లో గోల్డ్ మెడల్, ఎస్.నేహశ్రీ అండర్ 12 ఇయర్స్ లో సిల్వర్ మెడల్, ఎస్.తనుశ్రీ అండర్ 10 ఇయర్స్ లో బ్రాంచ్ మెడల్, డి.సాయివరుణ్ అండర్ 12 ఇయర్స్ బాయ్స్ లో బ్రాంచ్ మెడల్ సాధించి జయ కేతనం ఎగరవేశారు. అలాగే ఎస్.నేహాశ్రీ అండర్ 12 ఇయర్స్ స్పై రింగ్ లో సెకండ్ గ్రాండ్ ఛాంపియన్షిప్ గా నిలిచి ఆల్ ఇండియా లెవెల్ లో మంచి పేరు తెచ్చుకుంది. గెలుపొందిన విద్యార్థులను సోమవారం పాఠశాల కరస్పాండెంట్ సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా తాళ్లపల్లి రమేష్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు స్వయం రక్షణలో కూడా ప్రావీణ్యం ఉండాలని, దీనికోసం వికాస్ పాఠశాలలో ప్రతి సంవత్సరం విద్యార్థులకు కరాటే తరగతులు నిర్వహిస్తూ నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ లో పోటీలలో పాల్గొని గెలుపొందుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ లు వేణుమాధవ్, నాగరాజు వైస్ ప్రిన్సిపల్ రాజు, లింగమూర్తి, ఉపాధ్యాయులు, కరాటే మాస్టర్ రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.