చేయూత పెన్షన్లతో నిరుపేదలకు ఆర్థిక భరోసా
19, 20, 21వ వార్డుల లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ
హుజూర్నగర్, నవంబర్ 25 (ప్రజానేస్తం జ్వాల): హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 19, 20, 21వ వార్డులకు చెందిన చేయూత సామాజిక భద్రతా పెన్షన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున రావు, 19వ వార్డు కౌన్సిలర్ వల్లపుదాసు కృష్ణ గౌడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 19వ వార్డు కౌన్సిలర్ వల్లపుదాసు కృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చేయూత పథకం ద్వారా వితంతువులు, గీత కార్మికులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు సామాజిక భద్రత కల్పిస్తూ పెన్షన్లు అందించడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో, రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు.
19వ వార్డుకు ప్రత్యేకంగా 21 పెన్షన్లు మంజూరయ్యాయని, అర్హులైన 21 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసినట్లు వెల్లడించారు. మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున రావు మాట్లాడుతూ.. చేయూత పెన్షన్లు నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని పేర్కొన్నారు.
అనంతరం కౌన్సిలర్ కృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. 19వ వార్డు ప్రజలు తమ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా రైస్ మిల్లుల నుంచి వెలువడుతున్న ధూళి, కాలుష్యంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, రెండు పడక గదుల ఇళ్లకు సంబంధించిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు సైదా మేస్త్రీ, అజీజ్ పాషా, మాజీ కౌన్సిలర్ వల్లపుదాసు ఎల్లమ్మ వెంకటేశ్వర్లు, దొంతగాని జగన్, ఆసిఫ్, మున్సిపల్ మేనేజర్ అశోక్, బిల్ కలెక్టర్ నరసింహారావు, పారిశుధ్య తనిఖీ అధికారులు అశోక్, దుర్గాప్రసాద్ రావు, మెప్మా సిబ్బంది ఎల్లవుల స్పందన, వీరలక్ష్మి, విజయలక్ష్మి, వార్డు కార్యాలయ అధికారి ఎస్.కె. నాగులమీరా, టీం 19 సభ్యులు ఎస్.కె. నాగుల మేస్త్రీ, ఆటో రఫీ, విఘ్నేష్, కనేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.