జయశంకర్ సార్ స్వగ్రామం అక్కంపేటను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి
హనుమకొండ, నవంబర్ 25 (ప్రజానేస్తం జ్వాల): తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ స్వగ్రామమైన అక్కంపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అక్కంపేటను నమూనా గ్రామంగా ఎంపిక చేసిన నేపథ్యంలో బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో గ్రామ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కుడా ఛైర్‌పర్సన్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, వివిధ శాఖల అధికారులతో కలిసి గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, అవసరమైన కార్యాచరణపై చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ అక్కంపేటను నమూనా గ్రామంగా ఎంపిక చేయడం అభివృద్ధికి గొప్ప అవకాశమని పేర్కొన్నారు. గ్రామాన్ని సుందరంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. విద్యార్థులు, యువతకు ఉపయోగపడేలా గ్రంథాలయం ఏర్పాటు చేయాలని, రహదారులు, మురుగునీటి కాలువలు, తాగునీటి పైపులైన్లు, భూగర్భ మురుగునీటి వ్యవస్థ, విద్యుత్ సదుపాయాల కల్పనకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని అన్నారు. కుడా ఛైర్‌పర్సన్ గుండు సుధారాణి మాట్లాడుతూ అక్కంపేటలో పట్టణ స్థాయి సౌకర్యాలు కల్పించేలా అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. వాకింగ్ ట్రాక్‌తో పాటు ప్రజలకు అవసరమైన ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి మాట్లాడుతూ గ్రామ సమగ్ర అభివృద్ధికి వివిధ శాఖల అధికారులు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి త్వరితగతిన అందజేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ సామ్య నాయక్, కుడా సీపీఓ అజిత్ రెడ్డి, ఈఈ భీమ్ రావు, మిషన్ భగీరథ ఈఈ గాయత్రి, తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డి, అక్కంపేట సర్పంచ్ సాంబయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.