🏠 www.prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 25 November 2026, 7:50 pm Posted by : Praja Nestham Jwala News

సంవిధాన్ రక్షా మార్చ్‌ను విజయవంతం చేయాలి: గజ్జెల కాంతం

News Image
హైదరాబాద్, నవంబర్ 25 (ప్రజానేస్తం జ్వాల): రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల కాపాడటమే లక్ష్యంగా నిర్వహిస్తున్న సంవిధాన్ రక్షా మార్చ్‌ను విజయవంతం చేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ కోఆర్డినేటర్ గజ్జెల కాంతం పిలుపునిచ్చారు. చంద్రపురి కాలనీ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో డివిజన్‌లోని కమ్యూనిటీ హాల్‌లో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన గజ్జెల కాంతం మాట్లాడుతూ, ఏఐసీసీ, పీసీసీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా చేపడుతున్న సంవిధాన్ రక్షా కార్యక్రమంలో భాగంగా నవంబర్ 26న హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు.

లిబర్టీ సర్కిల్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగుతుందని వివరించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం చేపడుతున్న ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అలాగే పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ గొడుగు వేణు, బింగి సతీష్ గౌడ్, నాయకులు రజిత గోపాల్, కారింగుల రాజు గౌడ్, చిట్టి బాబు, ప్రధాన కార్యదర్శి బూడిద వెంకటేష్, జోగి సునీత, మాధవ రెడ్డి, నర్సింగరావు ముదిరాజ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాహుల్ కదం, రేసు లక్ష్మీ, నర్ర మహేష్, సాయి కృష్ణ (మిట్టు), రామిరెడ్డి, టోపీ స్వామి, కాలేశా, బబ్లూ ముదిరాజ్, బూడిద శ్రీనివాస్, భాస్కర్ గౌడ్, ఇరగడిండ్ల రాజు మహేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home