నరేంద్ర మోడీ ప్రభుత్వం విధివిధానాలతో వ్యవసాయ కూలీలకు తీరని నష్టం. దేశ ప్రజల శ్రమను దోచి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్న మోడీ ప్రభుత్వ విధివిధానాలు. కార్మిక సంఘాల నాయకులు కొత్తపల్లి రవి, బొల్లం అశోక్, బందు మహేందర్, ఉడుగుల లింగయ్య.
తొర్రూరు మహబూబాబాద్ జిల్లా నవంబర్ 26 (ప్రజానేస్తం జ్వాల జిల్లా ప్రతినిధి):
దేశ ప్రజల శ్రమను దోచి కార్పొరేట్ కంపెనీలకు కట్టపెట్టే విధంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ విధివిధానాలు అనుసరిస్తున్నాడని కార్మిక సంఘాల నాయకులు కొత్తపల్లి రవి, బొల్లం అశోక్, బంధు మహేందర్, ఉడుగుల లింగయ్య లు విమర్శించారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను నిర్శిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్.కే.యం) పిలుపులో భాగంగా గురువారం తొర్రూరు గాంధీ విగ్రహం ఎదురుగా భారీ రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి అన్నం పెడుతున్న వ్యవసాయ కూలీలకు పెద్ద ఎత్తున నష్టం తెచ్చే విధానాలను తీసుకొస్తున్నాడని అన్నారు. ఇప్పటికే అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆ వర్గాలు ప్రభుత్వ చర్యల మూలంగా పెనం నుంచి పోయిలో పడ్డ చందంగా వారి పరిస్థితి మారిందని అన్నారు. రాతపూర్వకంగా మోడీ ప్రభుత్వం రైతు సంఘాలకు ఇచ్చిన హామీలలో భాగంగా రైతు పంటకు గిట్టుబాటు ధర చట్టం తీసుకు రాలేదని రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయలేదని వ్యవసాయ మార్కెట్ల చట్ట సవరణ ముసాయిదాను ఉపసంహరించుకోలేదని చట్ట సవరణ అమలు చేస్తున్నారని ఆరోపించారు. మోడీ అనుసరిస్తున్న విధానాల మూలంగా వ్యవసాయ పారిశ్రామిక రంగాలు పూర్తిగా దెబ్బతిని దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందని అన్నారు. దేశం పరాధీనత వైపు పయనిస్తుందని ప్రధాని అంబానీ లాంటి కార్పోరేట్ కంపెనీలకు పెట్టడానికి దేశ ప్రజల శ్రమతో పాటు సహజ వనరులను కొల్లగొడుతున్నారని అన్నారు. ఓట్ చోరీకి పాల్పడుతూ అక్రమ పద్ధతులలో గెలుపొందుతూ భారత రాజ్యాంగాన్ని అది ఇచ్చిన హక్కులను కాలరాస్తున్నార అని విమర్శించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని రాష్ట్రాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రైతు కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.