🏠 www.prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 26 November 2026, 4:38 pm Posted by : Kommanaboina Yakaiah

రాజ్యాంగాన్ని రక్షించుకుందాం దేశాన్ని కాపాడుకుందాం. సిపిఐ తొరూరు మండల కార్యదర్శి బందు మహేందర్. సిపిఐ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం.

News Image
తొర్రూరు మహబూబాబాద్ జిల్లా నవంబర్ 26 (ప్రజానేస్తం జ్వాల జిల్లా ప్రతినిధి):

రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం దేశాన్ని కాపాడుకుందాం అని సిపిఐ తొర్రూరు మండల కార్యదర్శి బందు మహేందర్ అన్నారు. గురువారం తొర్రూరు పట్టణ కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నవంబర్ 26 రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవాన్ని సిపిఐ తొర్రూరు మండల సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బందు మహేందర్ మాట్లాడుతూ సిపిఐ జాతీయ సమితి పిలుపుమేరకు తొర్రూర్ పట్టణ కేంద్రంలోని బిఆర్ అంబేద్కర్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టగా రాజ్యాంగాన్ని రక్షించుకుందాం దేశాన్ని కాపాడుకుందాం నినాదంతో 1949 నవంబర్ 26న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ఆమోదం పొందిన రోజును పురస్కరించుకొని ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా బందు మహేందర్ మాట్లాడుతూ దేశ సమగ్రతకు బిజెపి పాలన వల్ల ముప్పు ఏర్పడుతుందని రాజ్యాంగ శక్తిగా మారి దేశాన్ని ముక్కలు చేయడానికి బిజెపి ప్రయత్నిస్తుంది రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాలు చేస్తూ మతోన్మాద రాజకీయాలకు పాల్పడుతూ కుల మతాల మధ్య పేరుతో విభజించి ప్రజలను విడదీసి పాలిస్తుందని దేశంలో బిజెపి ఫాసిస్టు చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తూ అన్ని వర్గాల ప్రజలను అనుగదొస్తుందని పేదలపై భారము మోపుతూ సంపన్నులకు అనుకూలంగా వ్యవహరిస్తుందని నిత్యవసర ధరలు, డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి దేశంలో ఉద్యోగ సమస్య తీవ్రంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రభుత్వ సంస్థల ను ఆదాని అంబానీ వంటి కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తూ దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ తొర్రూరు మండల పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home