🏠 www.prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 26 November 2026, 4:46 pm Posted by : Kommanaboina Yakaiah

రాజ్యాంగమే మన బలం… ప్రజాస్వామ్యమే మన గళం. బీఆర్ఎస్ పెద్ద వంగర మండల అధ్యక్షులు ఈదురు ఐలయ్య.

News Image
పెద్ద వంగర మహబూబాబాద్ జిల్లా నవంబర్ 26 (ప్రజానేస్తం జ్వాల జిల్లా ప్రతినిధి)/

రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని భారత రాష్ట్ర సమితి పెద్దవంగర మండల అధ్యక్షులు ఈదురు ఐలయ్య అన్నారు.
పెద్దవంగర మండలం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యంగా దినోత్సవ వేడుకలు డా. బిఆర్ . అంబెడ్కర్ గారి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని స్పూర్తిగా తీసుకొని మన హక్కులకు పునాది మన ప్రజాస్వామ్యానికి ఆయువు… మన దేశ ఐక్యతకు మార్గదర్శి భారత రాజ్యాంగం! డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని, రాజ్యాంగ విలువలను కాపాడుతూ, సమానత్వం – స్వేచ్ఛ – సౌభ్రాతృత్వం – న్యాయం కోసం నిరంతరం పోరాడుదాం అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పాలకుర్తి దేవస్థాన మాజీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ,మండల ప్రధానకార్యదర్శి శ్రీరాం సంజయ్,సర్పంచ్లు కుందూరు వెంకన్న, గూగులోతు కవితయాకన్న, ఉపాధ్యక్షుడు కనుకుంట్ల వెంకన్న,మాజీ ఎంపీటీసీ పసులేటి వెంకటరామయ్య,ఎర్ర వెంకన్న,ఎస్సి సెల్ అధ్యక్షుడు చిలుక బిక్షపతి,గద్దల వెంకన్న, రాంపాక నారాయణ,యూత్ నాయకులు శ్రీరాం నవీన్,నిమ్మల కార్తీక్, బారి వెంకటనారాయణ,రాయారపు స్వామి తదితరులు పాల్గొన్నారు.
🏠 Home