బహుజన విద్యార్థి సంఘ నాయకుడు మంకాల మల్లేష్ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ బయలుదేరిన తొర్రూరు బహుజన నాయకులు.
తొర్రూరు మహబూబాబాద్ జిల్లా నవంబర్ 26 (ప్రజానేస్తం జ్వాల జిల్లా ప్రతినిధి):
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన నాయకులు,భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బహుజన సేన ఆధ్వర్యంలో నాయకులు ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి బయలుదేరారు.ఈ సందర్భంగా డాక్టర్ అలువాల విజయ్ కుమార్ ముందుగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతర హైదరాబాద్‌కు బయలుదేరుతున్న వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం వంటి విలువలను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బహుజన సేన నాయకులు కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ధర్మారపు నాగయ్య, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు మహంకాళ మల్లేష్, రాయిషెట్టి ఉప్పలయ్య, చిలుక మల్లేష్,మంగళపల్లి బాలాజి, మంగళపల్లి సుధాకర్, చంటి, నాగరాజు, శ్రీకాంత్, భీమయ్య రమేష్, సోమయ్య, యాకన్న తదితరులు పాల్గొని ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు బయలుదేరారు.