బహుజనులను పాలకులను చేసిన గ్రంథం భారత రాజ్యాంగం.. అమర్ సింగ్ తండా సర్పంచ్ జాటోత్ గంగా నరేష్ నాయక్. అమర్ సింగ్ తండాలో ఘనంగా భారత రాజ్యాంగ 77వ దినోత్సవ వేడుకలు.
తొర్రూరు మహబూబాబాద్ జిల్లా నవంబర్ 26 (ప్రజానేస్తం జ్వాల జిల్లా ప్రతినిధి):
భారతదేశంలోని బడుగు బలహీన వర్గాల బహుజనులను రాజ్యపాలన చేసేందుకు రచించిన మహత్తర గ్రంథం భారత రాజ్యాంగం అని అమర్ సింగ్ తండా సర్పంచ్ జాటోత్ గంగ నరేష్ నాయక్ అన్నారు. బుధవారం తొర్రూరుnమండలంలోని అమర్ సింగ్ తండాలో సర్పంచ్ జాటోత్ గంగా నరేష్ నాయక్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సర్పంచ్ గంగా నరేష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం విలువలను దాని పరిరక్షణ కొరకు జరిగే కార్యక్రమాలలో పాల్గొని రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని అవసరం నేడు బహుజనులకు ఉన్నదని తెలిపారు నేడు అగ్రకుల దృహంకారులు హిందూ మతాచాంద్ర సమాధులు రాజ్యాంగంపైన దాడి చేయడానికి పూనుకుంటున్నారని, భారతదేశంలో రాజ్యాంగాన్ని అమలుపరచకుండా కుట్రలు జరుగుతున్నాయని, దళిత, గిరిజన, బహుజనులు అందరు ఐక్యంగా ఉండి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతి కార్యదర్శి ఉషా రెడ్డి,ఉప సర్పంచ్ జాటోత్ నవీన్, అంగన్వాడి టీచర్ భారతి, గ్రామస్తులు నరేందర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.