ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి సంఘం బలోపేతానికి కృషి. ఎర్రబెల్లిగూడెం గ్రామ ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి పెనుమాటి శ్రీనివాస్.
నెల్లికుదురు మహబూబాబాద్ జిల్లా నవంబర్ 26 (ప్రజానేస్తం జ్వాల జిల్లా ప్రతినిధి):
ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి ఆర్యవైశ్య సంఘం బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తానని ఎర్రబెల్లిగూడెం గ్రామ ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి పెనుమాటి శ్రీనివాస్ అన్నారు. గురువారం నెల్లికుదురు మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అందరి ప్రజల్లో లాగానే ఆర్యవైశ్యుల్లో కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే వారు ఉన్నారని... పేరుకే ఓసి జాబితాలో ఉంటారు కానీ అనేక ఆర్థిక ఇబ్బందులతో చెప్పుకోలేని పరిస్థితుల్లో సతమతమవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్యవైశ్యుల్లో ఉన్న పేద వారిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎర్రబెల్లిగూడెం ఆర్యవైశ్యులకు ఎవరికి ఎలాంటి సమస్య వచ్చిన 24 గంటలు అందుబాటులో ఉండి వారి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.