వరంగల్‌లో రోడ్డు ప్రమాదం.. లెక్చరర్ సూరిశెట్టి అనిల్ దుర్మరణం
వరంగల్, నవంబర్ 27 (ప్రజానేస్తం జ్వాల): ఖిలా తూర్పుకోట ప్రాంతానికి చెందిన లెక్చరర్ సూరిశెట్టి అనిల్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నిన్న అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వస్తుండగా వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. తీవ్రంగా గాయపడిన అనిల్‌ను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. లెక్చరర్ అనిల్ మృతితో తూర్పుకోట ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.