🏠 www.prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 27 November 2026, 6:53 pm Posted by : Praja Nestham Jwala News

వరంగల్ విశ్వకర్మ వీధిలో యువకుడి అనుమానాస్పద మృతి

News Image
వరంగల్, నవంబర్ 27 (ప్రజానేస్తం జ్వాల): వరంగల్ నగరంలోని విశ్వకర్మ వీధిలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడిని అతని స్నేహితుడు గమనించి వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. మృతుడిని పుప్పాలగుట్టకు చెందిన విక్రమ్‌గా పోలీసులు గుర్తించారు. అతను ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. అయితే యువకుడి మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

సమాచారం అందుకున్న మట్టేవాడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసును పరిగణించి వివిధ కోణాల్లో విచారణ చేపడుతున్నారు. పోలీసుల దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
🏠 Home