🏠 www.prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 27 November 2026, 7:37 pm Posted by : Nagaraju Golla

పాకాల చెరువు మధ్యలో కొలువైన గుండం శివాలయం.. కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు

News Image
కాకతీయుల కాలం నాటి ప్రసిద్ధ శైవక్షేత్రంలో అభిషేకాలు, విశేష పూజలు

పాకాల, నవంబర్ 27 (ప్రజానేస్తం జ్వాల): పాకాల అటవీ ప్రాంతంలోని ప్రసిద్ధ పాకాల చెరువు మధ్యలో ప్రకృతి అందాల నడుమ కొలువై ఉన్న గుండం శివాలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పన్నెండో శతాబ్దంలో కాకతీయ రాజు గణపతిదేవుడు ఈ శైవక్షేత్రాన్ని నిర్మించినట్లు స్థానికంగా ప్రసిద్ధి. చుట్టూ పచ్చని ప్రకృతి, మధ్యలో ప్రశాంతమైన చెరువు వాతావరణం మధ్య వెలసిన పరమేశ్వరుడి ఆలయం ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా నిలుస్తోంది. గుండం శివాలయం పాకాల ప్రాంతంలోని ప్రముఖ శైవక్షేత్రంగా భక్తుల ఆదరణ పొందుతోంది.

కార్తీక మాసం శుక్రవారం, ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో స్వామివారికి అభిషేకం, విశేష పూజలు, హారతి కార్యక్రమాలు నిర్వహించారు. ఆరుద్ర నక్షత్రం స్వామివారి జన్మనక్షత్రమని భావించే భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని పరమేశ్వరుడిని దర్శించుకున్నారు. స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాలని ఆలయ విశేషాలు తెలియజేస్తున్నాయి.
🏠 Home