స్నాప్‌చాట్‌లో మహిళకు వేధింపులు.. హనుమకొండ యువకుడి అరెస్ట్
హనుమకొండ, నవంబర్ 27 (ప్రజానేస్తం జ్వాల): సామాజిక మాధ్యమ వేదిక స్నాప్‌చాట్ ద్వారా ఓ మహిళను వేధించిన ఆరోపణలపై హనుమకొండ జిల్లాకు చెందిన ఎడునూరి అక్షిత్ అనే యువకుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం.. నిందితుడు బాధిత మహిళకు సంబంధించిన వ్యక్తిగత ఫొటోలను అసభ్యకరంగా మార్పులు చేసి, వాటిని ఆమె స్నేహితులు, పరిచయస్తులకు పంపుతూ వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ చర్యలతో బాధితురాలు తీవ్ర మానసిక ఇబ్బందులకు గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
వేధింపులు భరించలేక బాధిత మహిళ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరించి నిందితుడిని గుర్తించారు. అనంతరం ఎడునూరి అక్షిత్‌ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు సమాచారం.