తిరుమల వైకుంఠ ద్వార దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల
రేపటి నుంచి శ్రీవాణి టికెట్ల బుకింగ్ ప్రారంభం.. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు నవంబర్ 30న విడుదల
హనుమకొండ, నవంబర్ 27 (ప్రజానేస్తం జ్వాల): తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఎదురుచూస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సమాచారం వెల్లడించింది. డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన టికెట్లు, దర్శన టోకెన్ల విడుదల షెడ్యూల్‌ను ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 28న ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. నవంబర్ 30న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు అందుబాటులోకి రానున్నాయి.
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి తొలి రెండు రోజులకు సంబంధించిన స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల కోసం డిసెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ఈ-డిప్ నమోదు ప్రక్రియ కొనసాగనుంది. డిసెంబర్ 7న మధ్యాహ్నం 3 గంటలకు ఈ-డిప్ ద్వారా టోకెన్ల కేటాయింపు చేపట్టనున్నట్లు టీటీడీ వెల్లడించింది. భక్తులు నిర్ణీత తేదీలు, సమయాలను గమనించి అధికారిక టీటీడీ వెబ్‌సైట్ ద్వారానే టికెట్లు, టోకెన్ల కోసం నమోదు చేసుకోవాలని సూచించారు.