బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. ఒక్కరోజే తులం పుత్తడిపై రూ.1,850 పెరుగుదల
హనుమకొండ, నవంబర్ 27 (ప్రజానేస్తం జ్వాల): శుభకార్యాల సీజన్‌లో బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ధరల పెరుగుదల మరోసారి భారంగా మారింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో శుక్రవారం పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి. తాజా ధరల ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఒక్కరోజులోనే రూ.1,850 పెరిగి రూ.1,28,400కు చేరుకుంది. అదేవిధంగా ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,700 పెరిగి రూ.1,17,700 వద్ద కొనసాగుతోంది.
బంగారం బాటలోనే వెండి ధర కూడా భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ.5,000 పెరుగుదలతో ధర రూ.1,70,000కు చేరింది. స్థానిక పన్నులను బట్టి వివిధ ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. కొనుగోలుదారులు ప్రకటించిన ధరలకు అదనంగా 3 శాతం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నాయి.