🏠 www.prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 27 November 2026, 10:53 pm Posted by : Kommanaboina Yakaiah

తొర్రూరు చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలకు నామినేషన్లు

News Image
తొర్రూరు, నవంబర్ 27 :(ప్రజానేస్తం జ్వాల): తొర్రూరు చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కమిటీ ఎన్నికల కోసం శుక్రవారం నామినేషన్ల స్వీకరణ చేపట్టినట్లు ఎన్నికల కమిటీ కన్వీనర్ గుండాల నరసయ్య తెలిపారు.

అధ్యక్ష పదవికి మచ్చ సురేష్, బిజ్జాల అనిల్ కుమార్, పెరుమాండ్ల చక్రపాణి, ప్రధాన కార్యదర్శి పదవికి తల్లాడి హీరాధర్, చిదిరాల రవి, కోశాధికారి పదవికి చిదిరాల శ్రీనివాస్, బిజ్జాల విజయ్ కుమార్ నామినేషన్లు దాఖలు చేసినట్లు వెల్లడించారు. నామినేషన్లను పరిశీలించి అభ్యర్థుల జాబితాను ప్రకటించామన్నారు.

ఈ నెల 29న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని, ఎన్నికలు అనివార్యమైతే డిసెంబర్ 3న నిర్వహిస్తామని తెలిపారు. ఉపసంహరణ అనంతరం బరిలో నిలిచే అభ్యర్థులపై స్పష్టత రానుంది.

ఈ కార్యక్రమంలో ఎన్నికల కమిటీ సభ్యులు పంజాల ఉపేందర్, దారం ప్రసాద్, రేగురి వెంకన్న, మన్నూరి ఉమా, తోట శ్రీనివాస్, ఇమ్మడి రాంబాబు పాల్గొన్నారు.
🏠 Home