బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం.. ప్రతి ఒక్కరూ అడ్డుకోవాలి
తొర్రూరు, మహబూబాబాద్ జిల్లా, నవంబర్ 27 (ప్రజానేస్తం జ్వాల): నిర్ణీత వయస్సు నిండకముందే బాలబాలికలకు వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని సామాజికవేత్త, చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దొనికెన కుమారస్వామి అన్నారు.
నవంబర్ 27న నిర్వహించే అంతర్జాతీయ బాల్య, ముందస్తు, బలవంతపు వివాహాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా శుక్రవారం తొర్రూరు డివిజన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
2026 సెప్టెంబర్ 4న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసి, ప్రతి సంవత్సరం నవంబర్ 27ను అంతర్జాతీయ బాల్య, ముందస్తు, బలవంతపు వివాహాల నిర్మూలన దినోత్సవంగా ప్రకటించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా తొలిసారిగా ఈ ప్రత్యేక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
2024 నవంబర్ 27న భారత ప్రభుత్వం ‘బాల్య వివాహ రహిత భారత్’ నినాదంతో దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఈ క్రమంలో పశ్చిమ ఆఫ్రికా దేశమైన సియెర్రా లియోన్ ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి భారతదేశంతో పాటు 84 దేశాలు మద్దతు తెలిపాయని వివరించారు.
యునిసెఫ్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 70 కోట్ల మంది మహిళలు బాల్యంలోనే వివాహాలు చేసుకున్నారని తెలిపారు. బాల్య వివాహాల కారణంగా బాలికలు శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలతో పాటు కుటుంబ, సామాజిక పరమైన అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమనే విషయాన్ని ప్రతి ఒక్కరికీ తెలియజేయడంతో పాటు బాలికల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తును కాపాడటం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశమని అన్నారు. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ దినోత్సవాన్ని కేవలం నామమాత్రపు కార్యక్రమంగా నిర్వహించకుండా ప్రతి ఒక్కరూ బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిజ్ఞ చేయాలని సూచించారు. తమ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వాటిని అడ్డుకునేందుకు బాధ్యతగా ముందుకు రావాలని దొనికెన కుమారస్వామి కోరారు.