బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆవిర్భావ సదస్సు కరపత్రం ఆవిష్కరణ
సూర్యాపేట, నవంబర్ 28 (ప్రజానేస్తం జ్వాల): సూర్యాపేట జిల్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో డిసెంబర్ 13న నిర్వహించనున్న ఆవిర్భావ సదస్సుకు సంబంధించిన కరపత్రాన్ని జేఏసీ జిల్లా నాయకులు అవిరెండ్ల నాగేంద్రబాబు నేరేడుచర్ల మండలంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగేంద్రబాబు మాట్లాడుతూ, తెలంగాణలో సామాజిక న్యాయం, రాజ్యాధికార సాధన లక్ష్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మతపరమైన మైనారిటీలకు అన్ని రంగాల్లో జనాభా ప్రాతిపదికన వాటా కల్పించాలనే డిమాండ్‌తో జేఏసీ చైర్మన్ డా. విశారాధన్ మహారాజ్ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య ఉద్యమం కొనసాగుతోందని తెలిపారు.
మహాత్మా జ్యోతిరావు పూలే, సాహు మహారాజ్, డా. బి.ఆర్. అంబేద్కర్, మాన్యవర్ కాన్షీరాం ఆశయాలు, ఆలోచనా విధానాలను ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో జేఏసీ పనిచేస్తోందని పేర్కొన్నారు. గత ఏడాది కాలంగా పలు ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించామని, కొన్ని అంశాల్లో ఫలితాలు సాధించామని తెలిపారు. డిసెంబర్ 13న సూర్యాపేట జిల్లాలో నిర్వహించనున్న ఆవిర్భావ సదస్సుకు రాజకీయ పార్టీలకు అతీతంగా నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, విద్యావంతులు, యువత పాల్గొనాలని నాగేంద్రబాబు ఆహ్వానించారు.