డెంగ్యూ బాధితుడికి రూ.5 వేల ఆర్థిక సాయం
ధర్మసాగర్, నవంబర్ 28 (ప్రజానేస్తం జ్వాల): ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామానికి చెందిన వక్కల యాదగిరి గత కొన్ని రోజులుగా డెంగ్యూ జ్వరంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వల్లపు రెడ్డి రామ్ రెడ్డి (రామన్న) ఈరోజు యాదగిరిని స్వయంగా పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్య ఖర్చుల నిమిత్తం రూ.5,000 ఆర్థిక సహాయం అందించారు.
అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఆపద సమయంలో అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించిన రామన్నను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో వక్కల కరుణాకర్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొని యాదగిరి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు