🏠 www.prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 29 November 2026, 5:55 pm Posted by : Marelli kiran

హనుమకొండలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ సమావేశం

News Image
హనుమకొండ, నవంబర్ 29 (ప్రజానేస్తం జ్వాల): ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నేతృత్వంలోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం హనుమకొండలో నిర్వహించారు. ఈ సమావేశానికి ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత నిర్మాణం, పార్టీని క్షేత్రస్థాయిలో విస్తరించే అంశాలపై చర్చించారు. రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పార్టీ శ్రేణులకు సూచనలు చేసినట్లు తెలిపారు.

సామాజిక న్యాయం, బహుజనుల హక్కుల అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని నాయకులు కార్యకర్తలకు సూచించారు. సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యక్రమాలు, జిల్లా స్థాయిలో సంస్థాగత బలోపేతానికి సంబంధించిన అంశాలపై చర్చ జరిగినట్లు పేర్కొన్నారు.
🏠 Home