మచ్చ బొల్లారం చెత్తను జవహర్‌నగర్‌కు తరలిస్తే ప్రజాగ్రహం తప్పదు
డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటీ హెచ్చరిక
8వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు.. చిన్నారుల ప్రసంగంతో ఉద్వేగభరితమైన దీక్షా శిబిరం
జవహర్‌నగర్, నవంబర్ 29 (ప్రజానేస్తం జ్వాల): మచ్చ బొల్లారం ప్రాంతంలోని చెత్తను జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలించే ప్రయత్నాలను విరమించుకోవాలని, లేనిపక్షంలో ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటీ నాయకులు హెచ్చరించారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డును ఎత్తివేయాలని, స్థానిక ప్రజలకు కాలుష్యం నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేస్తూ చెన్నాపురం క్రాస్ రోడ్డులో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారం ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి.
జవహర్‌నగర్ డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దీక్షలకు జేఏసీ చైర్మన్ షేక్ షావలి నేతృత్వం వహించారు. టీయూజేఏసీ బాన్సువాడ రాజు, జర్నలిస్ట్ కొన్నె వేణు, ఏఐఎఫ్టీయూ వై. మల్లేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి టీయూజేఏసీ వేముల యాదగిరి, యాప్రాల్ పోరాట కమిటీ చైర్మన్ పీకేఎం రాజనర్సింహ ముఖ్య అతిథులుగా హాజరై సంఘీభావం తెలిపారు.
చిన్నారుల మాటలతో ఉద్వేగభరితమైన దీక్షా శిబిరం
ఎనిమిదో రోజు దీక్షలో లక్ష్మీనరసింహ కాలనీకి చెందిన ఇద్దరు చిన్నారులు స్వచ్ఛందంగా పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నాలుగో తరగతి చదువుతున్న పదేళ్ల విశ్వజిత్, మూడో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల మున్నా దీక్షా శిబిరానికి వచ్చి డంపింగ్ యార్డు సమస్యపై తమ ఆవేదనను వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డు నుంచి వెలువడుతున్న దుర్వాసన, కాలుష్యం కారణంగా పాఠశాలకు వెళ్లడం, బయట ఆడుకోవడం ఇబ్బందిగా మారిందని చిన్నారులు పేర్కొన్నారు. తరచూ దగ్గు, జ్వరం, వాంతులు వంటి సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. తమకు స్వచ్ఛమైన గాలి, మంచి నీరు, ఆడుకునేందుకు ఆరోగ్యకరమైన వాతావరణం కావాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి డంపింగ్ యార్డును తొలగించాలని చిన్నారులు విజ్ఞప్తి చేశారు. తమ సమస్య పరిష్కారం కాకపోతే మరింత మంది పిల్లలతో కలిసి ఉద్యమంలో పాల్గొంటామని పేర్కొన్నారు. చిన్నారుల ప్రసంగం దీక్షా శిబిరంలో ఉన్న వారిని భావోద్వేగానికి గురిచేసింది.
డంపింగ్ యార్డు తరలింపు నిర్ణయాన్ని విరమించుకోవాలి
ఈ సందర్భంగా వేముల యాదగిరి, పీకేఎం రాజనర్సింహ మాట్లాడుతూ జవహర్‌నగర్ పరిసర ప్రాంతాల ప్రజలు డంపింగ్ యార్డు సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డును ఎత్తివేయడంతో పాటు మచ్చ బొల్లారం చెత్తను ఇక్కడికి తరలించే ప్రతిపాదన ఉంటే వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ముందుకు వెళితే ప్రజా ఉద్యమం మరింత ఉధృతమవుతుందని హెచ్చరించారు.
దీక్షలో పాల్గొన్నవారు
ఈ రిలే నిరాహార దీక్షలో టీయూజేఏసీ కనకం ఆంజనేయులు, ఓగిరాల సుజీ, కళ్లెపు నర్సయ్య, సీపీఐ నాయకులు ఏ. సోమేష్, కె. రాజు, పీఓడబ్ల్యూ (విముక్తి) నాయకులు గడిపే సునీత, ఏ. నందిని, పి. రజిత, యమునా గౌడ్, టీపీటీఎల్ఎఫ్ బి. గణేష్, కె. సత్యనారాయణ, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జీ. రవి, ఏఐఎఫ్టీయూ కె. రాము తదితరులు పాల్గొన్నారు.
వివిధ సంఘాల సంఘీభావం
దీక్షా శిబిరానికి కమిటీ కోశాధికారి, ఐఎఫ్టీయూ నాయకుడు పి. శివబాబు, సీపీఐ దర్శనం యాదగిరి, సీపీఎం ఎస్. శ్రీనివాస్, వీఆర్ఆర్ హోమ్స్ సురేందర్, పీఓడబ్ల్యూ జయసుధ, బీసీ నేత వడ్డెర నర్సన్న, సీఎంఎస్ ఈ. జయ, అల్లూరి సావిత్రి, టీపీటీఎల్ఎఫ్ సురేందర్ కర్నే, డి. నాగరాజు, బి. రాజు, ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు టి. కాలేషా, మహ్మద్ వహీద్, సీపీఎం వెంకన్న, బహుజన రక్షణ సమితి జావేద్, వికలాంగుల సంఘం రంగం ఆంజనేయులు, బంగారు వేణుగోపాల్, టీవీఐవీ మబ్బుబాలు, కాక్రోచ్ పార్టీ శ్రావణ్ కుమార్, తెలుగుదేశం శ్రీరాములు, టీజేఎస్ శ్రీనివాస్ తదితరులు సంఘీభావం తెలిపారు.